ఆ విభాగం.. ఆందోళనకరం!
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:13 AM
india-vs-new-zealand-odi-series-team-india-bowling-concerns
రేపటి నుంచి న్యూజిలాండ్‌తో భారత్ వన్డే సిరీస్
ఆక్లాండ్: భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఓ అంకం పూర్తయ్యింది. టీ20 సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకుంది. ఈ టూర్‌లో రెండో కీలకమైన దశకు టీమిండియా సిద్ధమవుతోంది. ఐదు వన్డేల సిరీస్ బుధవారం ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌కు సంబంధించి భారత జట్టుకు బౌలింగ్ విభాగం.. ప్రధానంగా పేస్ దళం ఆందోళన కలిగిస్తోంది. ఈ విభాగం బాధ్యతలను మోసే గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్ అంతా కలిపి ఆడింది కేవలం 11 వన్డేలే. పైగా ఆ పేసర్లందరికి న్యూజిలాండ్ గడ్డపై ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. అనుభవజ్ఞుడైన పేసర్ సిరాజ్ (51 వన్డేలలో 77 వికెట్లు) వన్డే జట్టులో ఉన్నా..టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు మొదటి మూడు వన్డేల తర్వాత అతడు వైదొలగనున్నాడు. మరోవైపు జట్టులో ఉన్న ఏకైక ఆల్‌రౌండర్ నితీశ్ కూడా తొలివన్డే తర్వాత.. టెస్ట్ మ్యాచ్‌ల సన్నాహకం కోసం వెళ్లనున్నాడు. దాంతో 18 వన్డేల అనుభవజ్ఞుడైన అర్ష్‌దీప్, బ్రార్ (9 వన్డేలు), అన్షుల్ (ఒక వన్డే), నబీ (ఒక వన్డే), యశ్ ఠాకూర్ (వన్డే అరంగేట్రం చేయాల్సి ఉంది)లే పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో అర్ష్‌దీ్‌పపై అధిక భారం పడడం ఖాయం. అయితే వన్డే సిరీ్‌సలో బ్యాటింగ్ పిచ్‌లు ఎదురైతే మూడో సీమర్ ఎంపిక ప్రధాన సమస్య కానుంది. సిరాజ్, అర్ష్‌దీప్ ఎలాగూ తుది జట్టులో ఉంటారు. మూడో సీమర్ కోసం బ్రార్, కాంబోజ్, నబీ మధ్య పోటీ ఉంటుంది. బ్రార్‌కు తొమ్మిది వన్డేలు ఆడిన అనుభవం ఉన్నా..పరుగులు ధారాళంగా ఇస్తున్నాడు. మరోవైపు కాంబోజ్, నబీ బౌలింగ్‌లో వేగమున్నా..అంతర్జాతీయ అనుభవం లేకపోవడం సమస్య. ప్రస్తుత వన్డే జట్టులో అత్యంత సీనియర్ కుల్దీపే (124 మ్యాచ్‌ల్లో 201 వికెట్లు). కానీ ఎనిమిదో నెంబర్ వరకూ బ్యాటర్లుండాలనేది కోచ్ గంభీర్ వ్యూహం. ఈక్రమంలో ఎన్ని వన్డేలలో కులదీప్‌కు చోటు లభిస్తుందో చూడాలి. అయితే బౌలింగ్ విభాగం అనుభవలేమి కోణంలో చూస్తే..వన్డేలలో అతడు కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశముంది.
నెట్స్‌లో చెమటోడ్చిన గిల్
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఈ నెల 4 నుంచి జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముమ్మరంగా సాధన చేశా డు. సోమవారం నెట్స్‌లో అతడు మూడు గంటలకుపైగా చెమటోడ్చాడు. త్రోడౌన్‌లు ప్రాక్టీస్ చేసిన గిల్.. ఆ తర్వాత ఫీల్డింగ్ సెషన్‌లోనూ పాల్గొన్నాడు. ఆదివారం సుదీర్ఘంగా బౌలింగ్ చేసిన అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, అకిబ్ నవీకి విశ్రాంతి నిచ్చారు. కానీ, స్థానిక స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్‌లో గిల్, కేఎల్ రాహుల్ మాత్రమే బ్యాటింగ్ చేశారు. ఈ సమయంలో కొద్దిమంది అభిమానులు వీరిద్దరి సెల్ఫీలు, ఆటోగ్రా్‌ఫల కో సం ఎగబడ్డారు. భారీ షాట్లు ఆడిన అనంతరం రాహుల్ సర్దుకోగా.. గిల్ మాత్రం క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు. కాగా, కోహ్లీ నెట్ సెషన్‌లో పాల్గొనకుండా.. జిమ్ చేసి వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్రాక్టీస్‌కు రాలేదు. మంగళవారం మధ్యాహ్నం భారత్ మళ్లీ నెట్స్‌లో పాల్గొననుంది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!
ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..
అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..