Share News

ఖుష్బూకు రజతం

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:10 AM

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన ఈ యువ విశ్వక్రీడల్లో భారత్‌ రెండు పతకాలు సాధించింది. మహిళల జూడోలో...

ఖుష్బూకు రజతం

ధినిధికి కాంస్యం

యూత్‌ ఒలింపిక్స్‌

డకార్‌ (సెనెగల్‌): యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన ఈ యువ విశ్వక్రీడల్లో భారత్‌ రెండు పతకాలు సాధించింది. మహిళల జూడోలో ఖుష్బూ రజక్‌భాయ్‌ దర్జదా రజతంతో సత్తా చాటగా.. స్విమ్మింగ్‌లో ధినిధి దేశింఘు కాంస్యంతో మెరిసింది. జూడో 63 కిలోల విభాగంలో గుజరాత్‌కు చెందిన 15 ఏళ్ల ఖుష్బూ ఫైనల్లో జర్మనీ క్రీడాకారిణి జోలినా రీన్‌హోల్డ్‌ చేతిలో ఓటమిపాలై వెండి పతకంతో సరిపెట్టుకుంది. ఖుష్బూ సెమీ్‌సలో దౌనియా (అల్జీరియా)పై గెలిచి టైటిల్‌ఫైట్‌లో నిలిచింది. కానీ, పసిడి పోరులో మాత్రం జోలినా జోరు ముందు నిలవలేకపోయింది. కాగా, తన్‌గ్జామ్‌ తబాబిదేవి (2018లో రజతం) తర్వాత యూత్‌ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత జూడో ప్లేయర్‌గా ఖుష్బూ రికార్డుకెక్కింది. ఇక, స్విమ్మింగ్‌ మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో కర్ణాటకకు చెందిన 16 ఏళ్ల ధినిధి మూడో స్థానంతో కంచు మోత మోగించింది. ధినిధి 56.27 సెకన్ల కొత్త జాతీయ రికార్డు టైమింగ్‌తో గమ్యం చేరింది. తద్వారా యూత్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్‌గా ఆమె ఘనత వహించింది. అనా బొబనోవిచ్‌ (క్రొయేషియా) స్వర్ణం, అలిసా లాసన్‌ (న్యూజిలాండ్‌) రజతం నెగ్గారు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!

ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..

అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..

Updated Date - Nov 03 , 2026 | 05:10 AM