తీరం దాటిన మురసు తుఫాన్.. 110కి.మీ వేగంతో ఈదురుగాలులు!
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:21 AM
మురసు తీవ్ర తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మురసు తీవ్ర తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రధాన ప్రాంతం పూర్తిస్థాయిలో భూభాగంపైకి ప్రవేశించగా.. ఔటర్ బ్యాండ్స్ కూడా మరికొద్ది సమయంలో పూర్తిగా ల్యాండ్ మీద ప్రవేశించి తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పలు చోట్ల భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీరం దాటిన ప్రాంతాల్లో గంటకు కనిష్ఠంగా 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
ప్రస్తుతం మురసు తీవ్ర తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు సుమారు 8 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!
ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..