Share News

రైల్లో జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 01 , 2026 | 03:41 PM

బస్సులు, రైళ్లలో సీట్ల కోసం గొడవలు పడటం సర్వసాధారణమైన విషయం. రైళ్లలో ఆడవాళ్లు సీట్ల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాల్లో ఇలాంటి ఘటనలు తరుచూ చూస్తునే ఉంటాం. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

రైల్లో జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ప్రయాణికుల మధ్య చిన్నపాటి యుద్దాలే జరుగుతాయి. ముఖ్యంగా మహిళల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సీటు కోసం మొదలైన వీరి మధ్య గొడవ.. చినికి చినికి గాలివానలా మారినట్టు.. జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది.


ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కిందపడి మరీ కొట్టుకున్నారు. ఈ తగాదాను ఆపేందుకు అక్కడున్న ఇద్దరు పురుషులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ద్వారా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఓ మై గాడ్’ అని, ‘రైల్లో ఇలాంటి గొడవలు కామన్.. అందులోనూ జనరల్ క్లాస్‌లో సాధారణం’ అని రెస్పాండ్ అయ్యారు.


ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 04:31 PM