బడ్జెట్ 2026-27: విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS తగ్గింపు
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:34 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విదేశీ టూర్ ప్యాకేజీల విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్‌లో విదేశీ టూర్ ప్యాకేజీల విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పారు. సరళీకృత చెల్లింపు పథకం(LRS) కింద కొన్ని విదేశీ చెల్లింపులపై ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS)లో తగ్గింపును ప్రకటించింది కేంద్రం. విదేశీ ప్రయాణాలపై టీసీఎస్ 5 శాతం, 10 శాతం నుంచి 2 శాతానికి తగ్గించగా.. ఎల్ఎస్ఆర్ కింద విద్య, వైద్యం ఖర్చులపై కూాడా టీసీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల వరకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ పరిమితికి మించిన బదిలీలపై అదనపు మొత్తంలో 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణం, విద్య , వైద్య ప్రయోజనాల కోసం విదేశాలకు డబ్బు పంపే వ్యక్తులపై పన్ను భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలకు కూడా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థలకు టీసీఎస్ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాంటి చెల్లింపులు ఇప్పుడు స్పష్టంగా కాంట్రాక్టర్ చెల్లింపుల పరిధిలోకి వస్తాయి. ఫలితంగా కేవలం 1 శాతం లేదా 2 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలకు, ఉద్యోగులకు మధ్య ఉంటే పలు సమస్యలను తగ్గించేందుకు సాయపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం
బడ్జెట్ 2026: ఏది చౌకైనది.. ఏది ఖరీదైనది.?