Share News

బడ్జెట్ 2026: ఏది చౌకైనది.. ఏది ఖరీదైనది.?

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:41 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్డెట్‌లో వివిధ రంగాలకు పెద్దపీట వేశారు.

బడ్జెట్ 2026: ఏది చౌకైనది.. ఏది ఖరీదైనది.?

  • తగ్గనున్న సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు

  • బీడీలు, బ్యాటరీలపై తగ్గనున్న రేట్లు

  • CNG, బయోగ్యాస్, క్యాన్సర్ మందుల ధరలు తగ్గింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్డెట్‌లో వివిధ రంగాలకు పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్‌లో.. కేంద్రం విదేశీ పర్యటనకు సంబంధించిన టీసీఎస్‌పై కోత విధించింది. అలాగే పర్యాటకానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ బడ్జెట్‌లో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండగా.. మరికొన్నింటి ధరలు పెరగనున్నాయి.


ఏవి చౌకగా లభించనున్నాయంటే..

  • CNG, బయోగ్యాస్, 17 రకాల క్యాన్సర్ మందులు

  • తోలు ఉత్పత్తులు

  • స్మార్ట్‌ఫోన్‌లు

  • ఈవీ బ్యాటరీలు

  • సౌర ఫలకాలు

  • బీడీలు, బ్యాటరీలపై తగ్గనున్న రేట్లు


వీటి ధరలు పెరిగే అవకాశం..

  • ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాలు పెంచితే మాత్రం విదేశాల్లో తయారయ్యే లగ్జరీ వాచీలు, చెప్పులు, దుస్తులు.

  • విదేశాల నుంచి కొనుగోలు చేసే పూర్తిగా నిర్మించిన ప్రీమియం ఆటోమొబైల్స్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

  • బంగారం, వెండిపై దిగుమతి సుంకంలో ఏమైనా మార్పులు చేస్తే ఆభరణాల ధరలు కూడా పెరిగే అవకాశముంది.

  • బ్యూటీ ఉత్పత్తుల ధరలూ మరింత ఎగబాకవచ్చు.


క్యాన్సర్ మందులు..

17 రకాల క్యాన్సర్ మందులు, వాటి సంబంధిత ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదనంగా 7 రకాల అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్న మందులతో పాటు ప్రత్యేక వైద్య ఆహారం దిగుమతిపై సుంకం మినహాయింపులిచ్చారు. ఈ రోగులకు గణనీయంగా ఉపశమనం కలిగించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.


ప్రాణాలను రక్షించే చికిత్సలకు ప్రాముఖ్యతను మెరుగుపర్చడం, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న సుంకం విధించదగిన వస్తువులు 20 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గిస్తున్నట్లు వివరించారు. అలాగే మైక్రో ఓవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయింపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 01:20 PM