మనిషి తోక...
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:35 PM
మానవ పరిణామక్రమంలో... మనిషి కోతి నుంచి వచ్చాడని చెబుతుంటారు. కాలక్రమంలో మనిషి చాలా మార్పు చెందాడు.
మానవ పరిణామక్రమంలో... మనిషి కోతి నుంచి వచ్చాడని చెబుతుంటారు. కాలక్రమంలో మనిషి చాలా మార్పు చెందాడు. ఆ మార్పులో ముఖ్యమైనదేమిటంటే... మనిషికి ఉన్న తోక మాయమవ్వడం. ఒకవేళ ఆ తోక మళ్లీ మొలిస్తే... అచ్చంగా ఫొటోలో కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. సైంటిస్టులు అదే పనిలో ఉన్నారు. ఒక రోబో తోకను సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ తోక ఎందుకనే అనుమానం సహజంగానే ఎవరికైనా రావొచ్చు.
వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏ జంతువైనా కర్ర పట్టుకొని నడవడం చూశారా? మనిషి మాత్రం వయసు మీద పడ్డాక కర్ర పట్టుకోవాల్సిందే. దీనికి కారణం మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోవడమే. తోక ఉంటే కర్ర పట్టుకోవాల్సిన అవసరం ఉండదని అంటున్నారు సైంటిస్టులు. అందుకే మనిషికి తోకను తగిలించే ప్రయత్నంలో పడ్డామని చెబుతున్నారు జపాన్‌లోని కీయో యూనివర్సిటీ పరిశోధకులు.
ఒక మీటరు పొడవున్న రోబోటిక్ తోకను సముద్ర గుర్రాల సహజ కదలికల నుంచి ప్రేరణ పొంది తయారు చేశారట. ఈ తోక గడియారంలోని పెండ్యూలంలా కదులుతుంది. దీనివల్ల మనిషి సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలడు. ఈ తోక ఇంకా పరిశోధన దశలో ఉంది. ఎలా పని చేస్తుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనంటున్నారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతోం దంటే... భవిష్యత్తులో వృద్ధులు తోకలతో తిరుగుతూ కనిపించే దృశ్యం ఎంతోదూరంలో లేదనేగా!
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News