Share News

కొర్రల పులావ్‌.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:48 PM

కొర్రల పులావ్‌ తయారీకి కావలసిన పదార్థాలు.. కొర్రలు - కప్పు, నీళ్లు - రెండు కప్పులు, నూనె - రెండు స్పూన్లు, ఉల్లి ముక్కలు - అర కప్పు,

కొర్రల పులావ్‌.. తయారు చేసుకోండిలా..
Vantalu

కావలసిన పదార్థాలు: కొర్రలు - కప్పు, నీళ్లు - రెండు కప్పులు, నూనె - రెండు స్పూన్లు, ఉల్లి ముక్కలు - అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, జీలకర్ర - స్పూను, ధనియాల పొడి - స్పూను, పసుపు - అర స్పూను, కారం - అర స్పూను, క్యారెట్‌, క్యాప్సికమ్‌, బీన్స్‌ ముక్కలు - కప్పు, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - అర కప్పు.


తయారుచేసే విధానం: కొర్రలని అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరవాత నీళ్లని వడగట్టాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి జీలకర్ర చిటపటలాడించాలి. ఉల్లి, వెల్లుల్లి ముక్కలూ జతచేయాలి. కాస్త రంగు మారాక, ధనియాల పొడి, పసుపు, కారం చేర్చాలి. కూరగాయల ముక్కల్ని వేసి కాసేపు వేయించి, ఆ తరవాత కొర్రలని వేయాలి. రెండు గ్లాసుల నీళ్లని వేసి, ఉప్పు కలిపి మూతపెట్టాలి. పావుగంట తరవాత మూత తీస్తే కొర్రల పులావ్‌ సిద్ధం. పైన కొత్తిమీర జల్లితే సరి. అవసరమైతే బాదం పలుకులు, జీడిపప్పు ముక్కల్ని కూడా చేర్చవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

శనగల మసాలా కూర

తినగ తినగ మునగ...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 12:48 PM