సముద్ర గర్భం... కళాత్మకం!
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:19 PM
ఓషన్ గయా.. జపాన్ సముద్ర గర్భంలో ఏర్పాటుచేసిన అద్భుత కళాఖండం. ఓ మహిళ గర్భంతో నిద్రపోతున్నట్టు కనిపించే, 45 టన్నుల బరువున్న ఈ భారీ శిల్పాన్ని ప్రముఖ అండర్ వాటర్ శిల్పకారుడు జేసన్ డి కేర్స్ టేలర్ రూపొందించాడు.
ఓషన్ గయా.. జపాన్ సముద్ర గర్భంలో ఏర్పాటుచేసిన అద్భుత కళాఖండం. ఓ మహిళ గర్భంతో నిద్రపోతున్నట్టు కనిపించే, 45 టన్నుల బరువున్న ఈ భారీ శిల్పాన్ని ప్రముఖ అండర్ వాటర్ శిల్పకారుడు జేసన్ డి కేర్స్ టేలర్ రూపొందించాడు. ఇది జపాన్‌లో ఏర్పాటు చేసిన తొలి అండర్ వాటర్ శిల్పంగా గుర్తింపు పొందింది.
ఈ శిల్పాన్ని ప్రముఖ జపాన్ మోడల్ కికో మిజుహారా ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. గర్భిణి ఆకృతిలో ఉన్న ఈ శిల్పం... తల్లి, జీవం, సముద్రం మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే... శిల్పం అంచుల చుట్టూ ప్రత్యేక రంధ్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో చేపలు, ఇతర సముద్ర జీవులు ఆశ్రయం పొందేలా డిజైన్ చేశారు. కాలక్రమేణ నాచు పెరిగి... శిల్పం కృత్రిమ సముద్ర ఆవాసంగా మారుతుందని భావిస్తున్నారు. యువతకు సముద్ర పరిశోధనల్లో ఆసక్తి పెంచడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి. మిగతా దేశాలు భూమిపై శిల్పాలు చెక్కుతూ, ప్రదర్శిస్తుంటే... జపాన్ మాత్రం సముద్ర గర్భంలో సరికొత్త కళా ప్రపంచాన్ని సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
గుండెలోని బాధకు ఓ టెలిఫోన్ బూత్
Read Latest AP News And Telangana News And International News And Telugu News