పాక్‌పై భారత్ విజయం.. వైభవ్ సూర్యవంశీ ప్రశంసలు..
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:11 PM
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఈ పోరులో ఒక్క వికెట్ తేడాతో భారత్ గెలిచి తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఈ పోరులో ఒక్క వికెట్ తేడాతో భారత్ గెలిచి తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కూడా ఆనందం వ్యక్తం చేశాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. అతడిని 'స్టార్ బాయ్' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభినందించాడు.
'కంగ్రాచ్యులేషన్స్.. ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్' అంటూ వైభవ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పంచుకున్నాడు. 'స్టార్ బాయ్.. ఆర్యవీర్ సెహ్వాగ్' అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ టోర్నీలో ఆర్యవీర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 90.25 సగటుతో ఏకంగా 361 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 160 పరుగులు. ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి 61 బంతుల్లో 58 పరుగులు చేశాడు. టోర్నమెంట్ ఉత్తమ ఆటగాడి అవార్డును కూడా అందుకున్నాడు (India U19 Asia Cup Final).
ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతంగా పోరాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది (U19 Asia Cup 2026). దీంతో భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఒక దశలో పాకిస్థాన్ విజయం సాధించేలా కనిపించినా.. భారత యువ ఆటగాళ్లు చివరి వరకు పోరాడారు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో మొహిత్ ఉల్వా బౌండరీ బాది భారత్‌కు విజయాన్ని అందించాడు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..