Share News

వింతగా ‘చెప్పు’కుంటున్నారు.!

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:43 PM

హై హీల్స్‌, ఫ్లాట్స్‌, స్లిప్‌ ఆన్స్‌... ఇలా ‘చెప్పు’కొంటూ పోతే బోలెడు రకాలున్నాయి.

వింతగా ‘చెప్పు’కుంటున్నారు.!
Lifestyle

ఇంటర్నెట్ డెస్క్: హై హీల్స్‌, ఫ్లాట్స్‌, స్లిప్‌ ఆన్స్‌... ఇలా ‘చెప్పు’కొంటూ పోతే బోలెడు రకాలున్నాయి. కానీ ఇవి కూడా చెప్పులేనా? అనేలాంటి చెప్పులను ఎప్పుడైనా చూశారా? హాలీవుడ్‌ నటి మార్గరెట్‌ క్వాలీ ఇటీవల లండన్‌లోని ‘ది డాగ్‌ స్టార్స్‌’ ప్రీమియర్‌కి నల్లని దుస్తుల్లో వచ్చింది. క్వాలీ అందం, ఆ డ్రెస్‌ మీద కన్నా.. అందరి దృష్టి ఆమె కాళ్ల మీదే ఆగిపోయింది. ఎందుకంటే ఆమె కాళ్లకు చెప్పుల్లేకుండా వచ్చిందని అందరూ అనుకున్నారు.


నిజానికి క్వాలీ కాలి మడిమల వరకే రక్షణగా ఉన్న చెప్పులను ధరించి, వాటిని లెదర్‌ పట్టీలతో పైకి కట్టింది. ఇంకేం.. అందరూ ఆ చెప్పుల గురించే చర్చ మొదలుపెట్టారు. ‘సగం చెప్పు విరిగిపోయిందని కొందరంటే, కొందరేమో డిజైనర్లు సెలబ్రిటీలకు ఏం అమ్మినా తీసేసుకుంటారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.


వాళ్ల మాటల్ని కాసేపు పక్కన పెడితే..ఈ వింత చెప్పులను చానెల్‌ బ్రాండ్‌ 2027 కలెక్షన్‌ నుంచి ఆమె తీసుకుందని సమాచారం. ఈ తరహా చెప్పులు కేవలం నలుపు రంగులోనే కాకుండా.. బంగారం, వెండి రంగుల్లోనూ లభ్యమవుతున్నట్లు ఆ బ్రాండ్‌ ప్రకటించింది. పైగా వీటి ధర లక్ష రూపాలయలకు పైనే. అంత డబ్బు పోసి ఈ సగం చెప్పులను కొనడమేంటని పలువురు సెటైర్లు విసురుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హాథీ.. హమారా సాథీ!

గంగబాయిలమ్మ ఆకుకూర

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 01:15 PM