మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డుపై రచ్చరచ్చ..
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:04 PM
ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. నడిరోడ్డులో రచ్చరచ్చ చేసింది. క్యాబ్ డ్రైవర్‌పై బీరు చల్లింది. ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వారిపై బూతులతో విరుచుకుపడింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. నడిరోడ్డులో రచ్చరచ్చ చేసింది. క్యాబ్ డ్రైవర్‌పై బీరు చల్లింది. ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వారిపై బూతులతో విరుచుకుపడింది. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ యువతి బాగా మద్యం తాగి కారులో మెయిన్ రోడ్డుపైకి వచ్చింది. సర్కిల్ దగ్గర రోడ్డుపైనే కారును ఆపేసింది. బీరు బాటిల్ తీసుకుని రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీద వెళుతున్న వాహనదారులతో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత కారు మీదకు ఎక్కి బీరు తాగుతూ రచ్చరచ్చ చేసింది.
ఆమెను ప్రశ్నించిన వారిపై బూతులతో రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ క్యాబ్ డ్రైవర్‌పై బీరు చల్లింది. అంతటితో ఆగకుండా రోడ్డుపై అటు, ఇటు తిరుగుతూ.. బీరు తాగుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. కొద్దిసేపటి తర్వాత కారులో ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘తాగి రోడ్డు మీద అతి చేసే వారిని స్టేషన్‌లో పెట్టాలి’..‘ఇంకా నయం ఆ బీరు బాటిల్‌తో ఎవరి మీదా దాడి చేయలేదు’..‘ఆమెకు కొంచెం కూడా బుద్ధి లేనట్లుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అచార్ పనీర్ పులావ్.. తయారు చేసుకోండిలా..
55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్