అచార్ పనీర్ పులావ్.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:42 AM
అచార్ పనీర్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు: పనీర్ - 300 గ్రాములు, బియ్యం - రెండు కప్పులు, నిమ్మకాయ లేదా పచ్చి మిర్చి చట్నీ - రెండు స్పూన్లు, మిరియాలు - అయిదు, జీరా - స్పూను.
కావలసిన పదార్థాలు: పనీర్ - 300 గ్రాములు, బియ్యం - రెండు కప్పులు, నిమ్మకాయ లేదా పచ్చి మిర్చి చట్నీ - రెండు స్పూన్లు, మిరియాలు - అయిదు, జీరా - స్పూను, సోంఫు గింజలు - స్పూను, క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు, పెరుగు - అర కప్పు, కారం - స్పూను, పసుపు - అర స్పూను, బిర్యానీ ఆకులు - రెండు, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, నీళ్లు, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం : ఓ వెడల్పాటి బాణలిలో కాస్త నూనె వేసి జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకులు, సోంఫు గింజలు వేయించాలి. చిటపటలాడుతుంటే కారం, పసుపు, పెరుగు చేర్చాలి. రెండు నిమిషాల తరవాత నిమ్మకాయ చెట్నీ, ఉప్పు వేసి కలపాలి. బియ్యం, పనీర్, క్యాప్సికమ్ ముక్కలూ, మూడు కప్పుల నీళ్లు వేసి అన్నిటినీ బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి. చివర కొత్తిమీర తరుగు వేసి వడ్డిస్తే సరి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News