గద్వాల్‌లో లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:46 AM
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై ఓ లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
జోగులాంబ గద్వాల్, సెప్టెంబరు 6: జిల్లాలోని ఎర్రవల్లి జాతీయ రహదారిపై టెన్త్ బెటాలియన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన సాయిరాం, మౌనికలుగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, హైదరాబాద్ నుంచి గద్వాల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జడ్జీల కొరతతో కొండలా పెరిగిన కేసులు
సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి
Read Latest AP News And Telangana News And International