Share News

జడ్జీల కొరతతో కొండలా పెరిగిన కేసులు

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:57 AM

హైకోర్టు, జిల్లా కోర్టుల్లో జడ్జీల కొరత ఉండడంతో రాష్ట్రంలో పెండింగ్‌ కేసులు కొండలా పెరిగిపోతున్నాయి. కోర్టు భవనాల నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తునన్నప్పటికీ కేసుల భారం మాత్రం తగ్గడం లేదు.

జడ్జీల కొరతతో కొండలా పెరిగిన కేసులు
Supreme Court

  • రాష్ట్రంలో 11.67 లక్షల కేసుల పెండింగ్‌

  • హైకోర్టులో 2.29 లక్షలు.. జిల్లా కోర్టుల్లో 9.38 లక్షలు

  • సుప్రీంకోర్టు నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు, జిల్లా కోర్టుల్లో జడ్జీల కొరత ఉండడంతో రాష్ట్రంలో పెండింగ్‌ కేసులు కొండలా పెరిగిపోతున్నాయి. కోర్టు భవనాల నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తునన్నప్పటికీ కేసుల భారం మాత్రం తగ్గడం లేదు. 2025 జూన్‌ 30 నాటికి రాష్ట్రంలో 11.67 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టులో 2.29 లక్షలు, జిల్లా న్యాయ వ్యవస్థలో 9.3 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు వెలువరించిన ఇండియన్‌ జ్యుడీషియరీ వార్షిక నివేదిక 2024-25 వెల్లడించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 32 వేల కేసులు దశాబ్దానికి పైబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వాస్తవానికి హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 15 పదవులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టులో మొత్తం 1,709 పోస్టులు ఉండగా 1,263 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ విషయంలో మాత్రం రాష్ట్ర న్యాయవ్యవస్థ దూసుకుపోతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 కొత్త ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా ఇందులో 61 కొత్త కోర్టు హాళ్లు, 30 నివాస గృహసముదాయాలు ఉన్నాయి. జ్యుడీషియల్‌ సర్వీసులను డిజిటలైజ్‌ చేయడంలో హైకోర్టు ప్రత్యేకంగా దృష్టిపెట్టి వివిధ కోర్టుల్లో 99 ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేసుల పెండింగ్‌ విషయంలో దేశంలోని 25 హైకోర్టులతో పోలిస్తే తెలంగాణ హైకోర్టులో భారం మధ్యస్తంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

రేవంత్‌ రాజీనామా చెయ్‌

సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా..రెండేళ్ల సమయం ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:57 AM