ఈ చిరుత మరీ విచిత్రంగా ఉందే.. కుక్కపిల్లను వెంటపడి మరీ..
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:57 PM
చిరుతపులికి ఏదైనా జంతువు కనిపిస్తే.. ఇక దాన్నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఇలాంటి చిరుతలు కూడా విచిత్రంగా ప్రవర్తింస్తుంటాయి. తాజాగా, ఈ తరహా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .
చిరుత.. ఈ పేరు వింటేనే గుండెల్లో భయం మొదలవుతుంది. ఇక అవి కళ్ల ముందు కనిపించాయంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయితే అలాంటి ప్రమాదకర జంతువులు కూడా కొన్నిసార్లు అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అయితే, అరే.. ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉన్నాయే.. అనేలా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా, ఓ చిరుత నిర్వాకం కూడా ఇలాగే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఓ చిరుత పాల్ఘర్ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. చిరుతను పసిగట్టిన కుక్కలు భౌభౌ మంటూ అరిచాయి. అయితే తర్వాత చిరుత సమీపానికి రావడం చూసి అన్నీ భయంతో పారిపోయాయి. అయితే ఈ క్రమంలో కొన్ని కుక్క పిల్లలు చిరుత కంటపడ్డాయి.
వాటి వెనుకే వేగంగా పరుగెత్తిన చిరుత.. (Leopard chasing a puppy) ఓ కుక్క పిల్లకు అత్యంత సమీపానికి వెళ్లింది. ఇంకేముందీ.. దాని ప్రాణాలు పోయినట్లే అని.. అంతా అనుకుంటాం. కానీ ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తన నోటిని కుక్క పిల్ల దగ్గరికి పెట్టిన చిరుత.. ఏమనుకుందో ఏమో గానీ.. ఆ వెంటనే మనసు మార్చుకుని దాన్ని వదిలేసింది. ‘నువ్వు ఎలాగూ నా ఆకలి తీర్చలేవు.. వదిలేస్తు్న్నా బతుకుపో’.. అన్నట్లుగా ఆ కుక్క పిల్లను వదిలేసి.. అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయింది.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ చిరుతది ఎంత మంచి మనసో’.. అంటూ కొందరు, ‘క్రూర జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3, 500కి పైగా లైక్‌లు, 94 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
సీఎం ఆదేశాలను.. ఆటో డ్రైవర్ ఎలా పాటిస్తున్నాడో చూస్తే..
నేపాల్ వరదలకు కారణం ఇదే.. వైరల్‌గా మారిన డ్రోన్ విజువల్స్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..