చెల్లిని భుజాన ఎత్తుకుని తల్లిదండ్రుల కోసం వెతుకులాట.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
ABN , Publish Date - Aug 31 , 2026 | 10:59 AM
నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేశాయి. వరద నీటిలో అన్నీ కొట్టుకుపోయాయి.. కానీ ఓ అన్నాచెల్లెళ్ల బంధం మాత్రం చెదరలేదు. తల్లిదండ్రుల కోసం వెతుకుతూ.. తన చెల్లిని భుజాన ఎత్తుకుని నడుస్తున్న చిన్నారి దృశ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈ ప్రకృతి విపత్తు సృష్టించిన విషాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. చూసేవారి కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్న బాలుడు తన చెల్లిని భుజాన ఎత్తుకుని తల్లిదండ్రుల కోసం వెతుకుతూ ముందుకు నడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. చిన్నారి ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియక దీనంగా చూస్తున్నాడు. ఇద్దరు పిల్లల ముఖాలపై గాయాలు, గీతలు కనిపిస్తుండగా.. ఇంత చిన్న వయసులోనే తన చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్న అన్నను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. వరదల కారణంగా అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమై, కుటుంబాలు తమ ఆత్మీయులకు దూరమైన నేపథ్యంలో ఈ దృశ్యం మరింత హృదయ విదారకంగా మారింది.
ఈ వీడియో @JeetN25 అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘కష్టకాలంలో తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది’ అని, ఈ దృశ్యాన్ని ‘గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్’ సినిమాలోని తోబుట్టువులతో పోల్చుతున్నారు.
ఇవి కూడా చదవండి
పశ్చిమగోదావరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్.. నిలిచిపోయిన పలు రైళ్లు
సింగర్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో అనుమానిత షూటర్ల హతం..