Share News

సీఎన్‌జీ బంకులో ఊహించని ప్రమాదం.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:16 PM

ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది.

సీఎన్‌జీ బంకులో ఊహించని ప్రమాదం.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బంక్‌లో నిలిపి ఉంచిన కారులో.. సీఎన్‌జీని పైపు ద్వారా నింపుతున్నారు.

కారుకు ఆ పైపును పెట్టి వదిలేశారు. బంకులోని వారంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా కారుకు పెట్టి ఉన్న సీఎస్‌జీ పైపు ఊడిపోయింది. అందులోని గ్యాస్ ఉద్ధృతికి ఆ పైప్ వాయువేగంతో కదిలింది.


ఈ పరిణామాన్ని అక్కడ ఉన్న వారెవరూ అసలు ఊహించలేదు. అంతలో అక్కడే ఉన్న వ్యక్తిని ఆ గ్యాస్ పైప్‌ హ్యాండ్లర్ బలంగా తగిలింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అక్కడి వారంతా భయంతో తలోదిక్కు పరుగులు తీశారు. ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి.. సీఎన్‌జీని ఆఫ్ చేశాడు. అనంతరం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మరణించాడు. అతడి పేరు తుషార్ ఖుమ్రీ.


ఈ ఘటన ఆగస్ట్ 27వ తేదీన జార్ఖండ్‌లోని జంషెడుపూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సహజ వాయువుతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. సీఎన్‌జీ పైపు అలా వదిలివేయకుండా ఉండి ఉంటే.. ఈ ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Sep 01 , 2026 | 12:41 PM