నేపాల్ వరదలకు కారణం ఇదే.. వైరల్‌గా మారిన డ్రోన్ విజువల్స్..
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:19 PM
నేపాల్‌లో మెరుపు వరదలకు కారణమైన భారీ మంచు గడ్డ ధ్వంసానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ అనుకోకుండా ఈ దృశ్యాలను తన డ్రోన్ కెమెరాతో చిత్రీకరించాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో మెరుపు వరదలకు కారణమైన భారీ మంచు గడ్డ ధ్వంసానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ అనుకోకుండా ఈ దృశ్యాలను తన డ్రోన్ కెమెరాతో చిత్రీకరించాడు. అతడు డ్రోన్ షూట్ చేస్తున్న సమయంలో సముద్ర మట్టానికి 7,200 మీటర్ల ఎత్తులో ఉన్న లాంగ్తాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం వద్ద భారీ మంచు గడ్డ విరిగింది. దీంతో భారీ మొత్తంలో మంచుతో పాటు, కొండరాళ్లు, బురద 1,200 మీటర్ల కింద ఉన్న లోయలోకి వేగంగా పడిపోయాయి.
దీంతో అక్కడి భోటెకోశీ, త్రిశూలి నదులు ఒక్కసారిగా ఉప్పొంగి తీవ్రమైన మెరుపు వరదలు వచ్చాయి. ఆగస్టు 26వ తేదీన సంభవించిన మెరుపు వరదల కారణంగా నేపాల్‌లో 903 మంది, టిబెట్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,500 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. భారీ మంచు పర్వతం విరిగిపడిన దృశ్యాల తాలూకా వీడియోను మాస్సిమో అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్‌కు షాక్
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం