ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:50 AM
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
ఉత్తర్‌ప్రదేశ్, ఆగస్టు31: నొయిడా జిల్లాలోని జేవార్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు.. కారు సహా పలు వాహనాలను ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు.
నొయిడాలోని జేవార్ సమీపంలో యమునా రహదారిపైన ఓ ట్రక్కు అతివేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో అదుపుతప్పిన ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టి, అవతలి వైపు రోడ్డుమీదికి దూసుకెళ్లింది. అటువైపుగా వస్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
విశాఖలో రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన కారు, డ్రైవర్ సజీవ దహనం
వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కు మెసేజ్.. కానిస్టేబుల్ బలవన్మరణం