చెట్లపైనే వారి నివాసం.. ఇండోనేషియాలో వింత తెగ!
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:47 PM
ఇండోనేషియాలోని పపువాకు చెందిన కొరోవాయి తెగ ప్రజలు చెట్లపైన తమ ఇళ్లను నిర్మించుకుంటారు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చెట్లపైన పక్షులు నివసిస్తాయని తెలిసిందే. అయితే ఈ చెట్లపై ఒక తెగకు చెందిన మనుషులూ నివాసముంటారని మీకు తెలుసా? ఇండోనేషియాలోని పపువాకు చెందిన కొరోవాయి తెగ ప్రజలు దట్టమైన అడవుల్లో జీవిస్తారు. వీరు తమ నివాసాలను చెట్లపైనే ఏర్పాటు చేసుకుంటారు. 10 మీటర్ల నుంచి 50 మీటర్ల ఎత్తులో వీరి నివాసాలుంటాయి. నేలకు దూరంగా ఉంటే అడవి జంతువుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఈ తెగ ప్రజలు భావిస్తున్నారు. అలాగే ఇల్లు ఎత్తులో ఉండడం వల్ల నలువైపులా ఏం జరుగుతోందో నిత్యం గమనించవచ్చు. అందుకే వీరు ఇలాంటి ఇళ్లను నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ తెగ ప్రజలు అడవిలో దొరికి కలప, ఆకులు లాంటి వస్తువులతోనే ఇళ్లను నిర్మిస్తారు. ఎత్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లడానికి చెక్క నిచ్చెనలు ఉపయోగిస్తారు. చూడడానికి ఈ ఇళ్లు చిన్నగా కనిపించినా.. తమ కుటుంబం మొత్తానికి సరిపడ చోటు లోపల ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ ఇళ్లపై చర్చనడుస్తోంది. వీటి నిర్మాణం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నగర జీవితానికి భిన్నంగా ఉన్న కొరోవాయి తెగ ప్రజల జీవనశైలి చాలామందిని ఆకట్టుకుంటోంది.
ఈ వార్తలూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్