అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:15 PM
అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పికప్ క్రేన్ ఢీకొని 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పికప్ క్రేన్ ఢీకొనడంతో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని ప్రేరణ నీనమ మృతి చెందింది. సిల్వర్ ఓక్ యూనివర్సిటీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె.. ఉదయం ఇంటి నుంచి కళాశాలకు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో యూనివర్సిటీకి సుమారు 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో క్రేన్ వెనుక నుంచి వచ్చి ఆమెను ఢీకొట్టి.. ఆమెపై నుంచి దూసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి.
ప్రమాదం అనంతరం క్రేన్ డ్రైవర్ అరుణ్ నిషాద్ వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి సమీపంలోని సోలా ప్రాంతంలో అతడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్
కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు