Share News

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:43 PM

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటనపై వివాదం కొనసాగుతోంది. ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా వేధింపులు, కుల వివక్ష కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి కుటుంబం ఆరోపిస్తోంది.

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ  చీఫ్ మద్దతు
IIT Bombay student suicide

ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటనపై వివాదం కొనసాగుతోంది. ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా వేధింపులు, కుల వివక్ష కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై ఐఐటీ బాంబే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మాజీ చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ స్పందించారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన వ్యాఖ్యానించారు (IIT Bombay student suicide).


ప్రొఫెసర్ దుల్లా విషయంలో ఇప్పటివరకు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపణలు చేయడం మినహా, నిర్దిష్టమైన ఆధారాలు చూపలేదని శరద్ అన్నారు. ఆరోపణలకు సంబంధించి తేదీ, ఘటన లేదా ఇతర స్పష్టమైన వివరాలతో కూడిన ఆధారం లేదని ఆయన పేర్కొన్నారు. దుల్లా గత అకడమిక్ రికార్డును పరిశీలించినా ఆయన ప్రవర్తనపై సందేహించాల్సిన పరిస్థితి లేదని సరాఫ్ అన్నారు. దుల్లాకు ఐఐటీ బాంబే మాత్రమే కాకుండా ఇతర ఐఐటీలకు చెందిన కొందరు అధ్యాపకులు కూడా మద్దతు తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని కోరుతూ దుల్లాకు మద్దతు ప్రకటించారు (Professor Suryanarayana Doolla).


కాగా, సాహిల్ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ప్రొఫెసర్ దుల్లాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు (IIT Bombay caste discrimination). కుల వివక్ష కారణంగా తమ కుమారుడిపై వేధింపులు జరిగాయని కుటుంబం ఆరోపించింది. ఈ ఆరోపణలపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగేందుకు దుల్లాను సెలవుపై పంపాలని ఐఐటీ బాంబే బోర్డు నిర్ణయించింది. ఆయనను డీన్ పదవి నుంచి కూడా తప్పించారు. అదే సమయంలో ఘటనపై పరిశీలన కోసం 10 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


అమెరికాలో ల్యాండ్ అయిన జిన్‌పింగ్.. స్వయంగా స్వాగతం పలికిన ట్రంప్..

Updated Date - Sep 24 , 2026 | 01:52 PM