అమెరికాలో ల్యాండ్ అయిన జిన్‌పింగ్.. స్వయంగా స్వాగతం పలికిన ట్రంప్..
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:20 AM
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులు విదేశీ నేతలను విమానాశ్రయంలో స్వయంగా స్వాగతించడం అత్యంత అరుదు (Xi Jinping US visit).
షీ జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్నారు. అక్కడ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కలిసి షీ దంపతులకు స్వాగతం పలికారు. ఎర్ర తివాచీపై ఇరుదేశాల నేతలు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. సైనిక బ్యాండ్ సంగీతం మధ్య స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ పర్యటనలో పలు అధికారిక కార్యక్రమాలతో పాటు కీలక అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు (Donald Trump Xi Jinping).
అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా ఉండనున్నాయి (Xi Jinping Trump meeting). సుంకాలు, అరుదైన ఖనిజాల సరఫరా, సాంకేతిక రంగం, కృత్రిమ మేధ వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఇరుదేశాల మధ్య పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధపై చర్చలకు ప్రాధాన్యం ఉంది. వాణిజ్యం, సాంకేతిక రంగాలతో పాటు తైవాన్, ఇరాన్, భద్రతా అంశాలు కూడా ట్రంప్-జిన్‌పింగ్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
ఈ వార్తలనూ చదవండి:
యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!
ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు