Share News

ఒమన్ సమీపంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:37 PM

హోర్ముజ్‌లో మరో నౌకపై దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో ఎమ్‌వీ కేప్ డావ్‌ అనే నౌకపై టార్పిడోలతో దాడి జరగడంతో ఓ భారతీయ నావికుడు మృతి చెందారు.

ఒమన్ సమీపంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి
Strait of Hormuz

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్‌లో మరో నౌకపై తాజాగా దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో ఎమ్‌వీ కేప్ డావ్‌ అనే నౌకపై టార్పిడోలతో దాడి జరగడంతో ఓ భారతీయ నావికుడు మృతి చెందారు. భారత్ వైపు నౌక వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని మస్కట్‌లోని భారతీయ ఎంబసీ కూడా ధ్రువీకరించింది. భారతీయ పౌరుడి మృతిపై సంతాపం తెలిపింది. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపింది. నౌకలోని 19 మంది భారతీయ నావికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఒమన్ అధికారులతో కలిసి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.


ఈ ఘటనపై భారత నావికుల సంఘం ఫార్వర్డ్ సీమెన్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌యూఐ) కూడా స్పందించింది. మృతుడిని యూపీలోని దియోరా జిల్లాకు చెందిన సూరజ్ యాదవ్‌గా గుర్తించింది. నౌకపై రెండు టార్పిడోలతో దాడి జరిగినట్టు ఎఫ్‌ఎస్‌యూఐ పేర్కొంది. ఈ డాడులతో పౌర నావికులు ఊచకోతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

Updated Date - Sep 23 , 2026 | 09:47 PM