వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:12 PM
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట నిల్చున్న వృద్ధురాలిపై కోతి అకస్మాత్తుగా దూకడంతో ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయటకు వచ్చిన 91 ఏళ్ల వృద్ధురాలిపై కోతి అకస్మాత్తుగా దూకడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలిని నజ్మున్నీసా బేగంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నజ్మున్నీసా అనే వృద్ధురాలు ఏదో అలికిడి రావడంతో ఇంటి బయటకు వచ్చి చూసింది. అదే సమయంలో ఓ కోతి ఒక్కసారిగా ఆమె మీదకు దూకి కింద పడేసింది. ఈ ఘటన మొత్తం క్షణాల్లోనే జరిగిపోయింది. వృద్ధురాలు హఠాత్తుగా కిందపడటంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
వీడియోలో.. ఆ కోతి మరో వృద్ధురాలి వైపు కూడా వెళ్లినట్లు కనిపించింది. దీంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో కోతి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనతో ప్రాంతంలో కోతుల సంచారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..