Share News

జర్మనీ రైలులో భారత పర్యాటకుల పాటలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

ABN , Publish Date - Sep 01 , 2026 | 02:27 PM

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్‌చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

జర్మనీ రైలులో భారత పర్యాటకుల పాటలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు
Indian tourists sing, clap loudly on crowded train in Germany

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్‌చల్ చేశారు. భారతీయులు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


ఈ వీడియోలో కొందరు భారత పర్యాటకులు రైలు మధ్యలో నిల్చుని బిగ్గరగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉన్నారు. మరికొందరు వారికి వంతపాడుతూ చేతులు ఊపుతూ, ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చోగా, కొందరు మాత్రం అసంతృప్తిగా అలా చూస్తుండిపోయారు.


ఈ వీడియోను Amit24TD అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో భారతీయ పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కొందరు వ్యాఖ్యానించారు. రద్దీగా ఉన్న ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదని మరికొందరు సూచించారు. వ్యక్తిగత వేడుకలు, సరదాలను బహిరంగ ప్రదేశాల్లో ఇతర ప్రయాణికులపై రుద్దకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రైల్వే సిబ్బంది, అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదని మరికొందరు ప్రశ్నించారు.


ఇవీ చదవండి:

హెగ్సెత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?

విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్‌ ధర

Updated Date - Sep 01 , 2026 | 02:30 PM