Share News

రోబో వంటశాల

ABN , Publish Date - Aug 02 , 2026 | 01:08 PM

రెస్టారెంట్లు, ఆఫీసు క్యాంటీన్లు... ఇలా ఏ వంటగది అయినా 24/7 పని చేయాలంటే కష్టమే. వంటలు చేసేవాళ్లు కూడా దొరకడం గగనమే. అందుకే రోబోలు ఈ పనిని తమ భుజస్కంధాలపై వేసుకొని చేయడానికి సిద్ధమయ్యాయి.

రోబో వంటశాల
AI Robotic Kitchen

రెస్టారెంట్లు, ఆఫీసు క్యాంటీన్లు... ఇలా ఏ వంటగది అయినా 24/7 పని చేయాలంటే కష్టమే. వంటలు చేసేవాళ్లు కూడా దొరకడం గగనమే. అందుకే రోబోలు ఈ పనిని తమ భుజస్కంధాలపై వేసుకొని చేయడానికి సిద్ధమయ్యాయి. ఏఐ ప్రెసిషన్‌ రోబోటిక్స్‌ సహాయంతో సర్కస్‌ ఓఎస్‌ కంపెనీ అతిపెద్ద వంటగదిని సృష్టించింది. డేటా ఆధారంగా ఈ మెషీన్‌ ఆయా వంటకాలను అత్యంత వేగంగా పూర్తి చేస్తుంది. ఒకే ఒక్క గంటలో సుమారు 120 వంటకాలను సిద్ధం చేసేంత సామర్థ్యం దీనికి ఉంది.


సూప్‌... స్టార్టర్‌... మెయిన్‌ కోర్స్‌... ఇలా ఏదైనా తినాలనిపించిందనుకోండి... సదరు రెసిపీలో కొన్ని పదార్థాలు మీకు పడకపోవచ్చు లేదా నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు కావాల్సిన విధంగా ఈ మెషీన్‌ కస్టమైజ్డ్‌గా ఫుడ్‌ని సర్వ్‌ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... పూర్తిగా ఆటోమెటెడ్‌ రెస్టారెంట్‌లా పనిచేస్తుందన్నమాట. పదార్థాలను ఎంచుకోవడం నుంచి భోజనాన్ని ప్లేటింగ్‌ చేయడం వరకు... అన్నింటినీ ఈ మెషీన్‌ చూసుకుంటుంది. పైగా సమయం, ఎంత ఉష్ణోగ్రతతో వంటలను అందిస్తుందో కూడా తెలియచేస్తుంది. అంతేకాదు... వండిన గిన్నెలను ఎంచక్కా శుభ్రం చేస్తుంది కూడా.


book10.2.jpgతక్కువ స్థలంలో...

ఈ రోబో వంటశాలలో కూరగాయలు అయిపోయిన ప్రతీసారి రీఫిల్‌ చేయాల్సి ఉంటుంది. కూర గాయలను ఉంచడానికి మెషీన్‌లో 36 స్లాట్స్‌ ఉంటాయి. అత్యంత పరిశుభ్రంగా వంట చేస్తుంది. మెషీన్‌లో ఉండే నాలుగు జతల రోబో చేతులు ఒకేసారి నాలుగు వంటకాలను పూర్తి చేయగలవు. ఒకే ఒక్క గంటలో 120 వంటకాలను సిద్ధం చేస్తుందట. సిద్ధమైన వంటను తీసుకోవడానికి ఎనిమిది స్టేషన్లు ఉంటాయి. కేవలం ఏడడుగుల స్థలంలో ఇమిడిపోయే ఈ మెషీన్‌కి మనుషులతో పనే లేదు. పైగా రోబో చేతులు వంట చేస్తుంటే చూడటానికి గ్లాస్‌ నిర్మాణం ఉంటుంది. ఈ మెషీన్‌ని జర్మనీలో టెస్టింగ్‌, టేస్టింగ్‌ కోసం ఉంచారు. శాస్త్రీయ పరిశోధనల అనంతరం రోబో మెషీన్‌ వండిన వంటకాలన్నీ అదుర్స్‌ అని తేలింది. అయితే మార్కెట్లోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు. ఒకసారి ఈ రోబో వంటశాల వచ్చేసిందంటే... కుక్స్‌, చెఫ్స్‌ పరిస్థితి ఏంటో...?


ఈ వార్తలు కూడా చదవండి:

నల్లమలలో అపూర్వ శాసనాలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 01:08 PM