Share News

హనీ చిల్లీ ఆలూ.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా..

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:04 PM

హనీ చిల్లీ ఆలూ.. తయారీకి కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు (పొట్టుతీసి ముక్కలుగా కట్‌చేసి, నూనెలో వేయించినవి).

హనీ చిల్లీ ఆలూ.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా..
Vantalu

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు (పొట్టుతీసి ముక్కలుగా కట్‌చేసి, నూనెలో వేయించినవి), మొక్కజొన్న పిండి - నాలుగు స్పూన్లు, కారం - స్పూను, ఉల్లి కాడలు - వేయించినవి, వెల్లుల్లి పేస్టు - స్పూను, క్యాప్సికమ్‌ - ఒకటి (ముక్కలుగా కట్‌చేయాలి), తేనె - రెండు స్పూన్లు, సోయాసాస్‌ - పావు స్పూను, తెల్ల నువ్వులు - మూడు స్పూన్లు, చిల్లీ సాస్‌ - రెండు స్పూన్లు, ఉప్పు, నూనె - తగినంత.


book8.2.jpgతయారుచేసే విధానం: ఓ బాణలిలో మొక్కజొన్న పిండి, వెల్లుల్లి పేస్టు, ఉల్లి కాడలు వేసి, బాగా కలిపి ఓ నిమిషం పాటు వేయించాలి. క్యాప్సికమ్‌ ముక్కలు, తేనె, ఉప్పు, సోయా సాస్‌, చిల్లీ సాస్‌ వేసి మూడు నిమిషాలు ఉడికించాలి. తరవాత వేయించిన ఆలూ, నువ్వుల గింజల్ని కలిపితే సరి.


ఈ వార్తలు కూడా చదవండి:

నల్లమలలో అపూర్వ శాసనాలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 12:05 PM