Share News

అగ్నికి ఆజ్యం పోయొద్దు.. హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:44 AM

బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ‘సారీ హృతిక్’ అనే ట్రెండ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అగ్నికి ఆజ్యం పోయొద్దు.. హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!
Kangana Ranaut

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ‘సారీ హృతిక్’ అనే ట్రెండ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై హృతిక్ రోషన్ ఘాటుగా స్పందించారు. వాస్తవాల ఆధారంగా నడుచుకోవాలని హితువు పలికారు. తాజాగా దీనిపై స్పందించిన కంగనా.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.


రచయిత ఫ్రెడ్డి బర్డీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ ప్రపంచం హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పాలి’ అంటూ పోస్ట్ చేయగా, దానిపై హృతిక్ స్పందించారు. ఒక వ్యక్తి నచ్చకపోవడం వల్ల వాళ్ల శత్రువుకు సపోర్ట్ చేయడం సరైంది కాదని, వాస్తవాలు తెలిసిన తర్వాతే అభిప్రాయం చెప్పడం న్యాయమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు కంగనాతో ఉన్న పాత వివాదానికి ముడిపెట్టడంతో చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ హృతిక్‌కు బహిరంగ సందేశం పంపారు. ‘సబా ఆజాద్‌తో నీ జీవితం సంతోషంగా సాగుతుండటం ఆనందంగా ఉంది. కానీ నా పేరుతో కొందరు నన్ను వేధిస్తున్నప్పుడు వారిని ఖండించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసి అగ్నికి ఆజ్యం పోయొద్దు. నీ భాగస్వామిని కూడా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టొద్దు. అనవసర వ్యాఖ్యలను ఆపేస్తావని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.


హృతిక్-కంగనా వివాదమేంటి?

2016లో కంగనా ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌ను ‘సిల్లీ ఎక్స్’ అని పేర్కొనడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత ఇరువురూ ఒకరిపై ఒకరు లీగల్ నోటీసులు పంపుకోవడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు పదేళ్లు గడిచినా ఆ వివాదం ఇప్పటికీ సోషల్ మీడియాలో తరచూ తెరపైకి వస్తూనే ఉండటం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!

దులీప్ ట్రోఫీ: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ పాటీదార్

Updated Date - Aug 02 , 2026 | 01:31 PM