Share News

దులీప్ ట్రోఫీ: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ పాటీదార్

ABN , Publish Date - Aug 02 , 2026 | 06:53 AM

దులీప్ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ జట్టుకు స్టార్ బ్యాటర్ రజత్ పాటీదార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా రింకు సింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

దులీప్ ట్రోఫీ: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ పాటీదార్
Rajat Patidar

ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ జట్టుకు స్టార్ బ్యాటర్ రజత్ పాటీదార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా రింకు సింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆగస్టు 23 నుంచి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానాల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా సెంట్రల్ జోన్ జట్టు నేరుగా ఆగస్టు 30 నుంచి జరిగే సెమీఫైనల్‌లో బరిలోకి దిగనుంది. ఈస్ట్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య విజేతతో సెంట్రల్ జోన్ తలపడుతుంది.


జట్టులో భారత ఆటగాళ్లు హర్ష్ దుబె, యశ్ ఠాకూర్‌తో పాటు సారాంశ్ జైన్‌కు చోటు లభించింది. రంజీ ట్రోఫీలో రాణించిన విదర్భ ఓపెనర్ అమన్ మొఖడే, ఛత్తీస్‌గఢ్ బ్యాటర్ ఆయుష్ పాండేలకు అవకాశం దక్కింది. యశ్ రాథోడ్, జీషన్ అన్సారీ, అర్షద్ ఖాన్, నచికేత్ భూటేలు కూడా జట్టులో ఉన్నారు. వికెట్ కీపర్లుగా ఆర్యన్ జుయాల్, కునాల్ సింగ్ రాథోడ్ ఎంపికయ్యారు. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 9న జరగనుంది.


సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దుబె, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యశ్ ఠాకూర్, నచికేత్ భూటే.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్‌‌లో భారత్‌కు రెండు పతకాలు

నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..

Updated Date - Aug 02 , 2026 | 06:53 AM