Share News

కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్‌‌లో భారత్‌కు రెండు పతకాలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 06:58 PM

కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్-57 ఫైనల్లో సోమన్ రాణా పసిడి పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం గెలిచాడు.

కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్‌‌లో భారత్‌కు రెండు పతకాలు

స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్-57 ఫైనల్లో సోమన్ రాణా పసిడి పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం గెలిచాడు. రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలువగా.. శుభమ్ 13.28 మీటర్ల త్రోతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.


శుభమ్ జుయాల్, సోమన్ రాణా పతకాలతో భారత్‌ ఖాతాలో పతకాల సంఖ్య 30కి (8 స్వర్ణాలు, 15 రజతాలు, 7 కాంస్యాలు) చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ(శనివారం) ఒక్క రోజే భారత్‌ ఖాతాలో 3 స్వర్ణాలు చేరాయి. మహిళల బాక్సింగ్‌ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్‌, మహిళల బాక్సింగ్‌ 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా, పారా పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్-57 విభాగంలో సోమన్ రాణాలు పసిడి పతకం పట్టుకున్నారు.


ఇవాళ జరిగిన ట్రిపుల్ జంప్ పురుషుల విభాగంలోనూ భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రావేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు. పురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ జడుమణి సింగ్ రజతం సాధించాడు.


ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..

కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో రెండు పసిడి పతకాలు

Updated Date - Aug 01 , 2026 | 07:22 PM