Share News

కామన్వెల్త్ గేమ్స్ 2026 విజేతలను ప్రశంసించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 01 , 2026 | 03:16 PM

కామన్వెల్త్ గేమ్స్‌2026‍లో భారతదేశానికి పతకాలు అందించిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జావెలిన్ త్రోలో రజతం గెలిచిన నీరజ్ చోప్రా, కాంస్య పతక విజేత యశ్వీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కామన్వెల్త్ గేమ్స్ 2026 విజేతలను ప్రశంసించిన ప్రధాని మోదీ
Commonwealth Games 2026

స్పోర్ట్స్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ అథ్లెటిక్స్ దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఐదు స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 23 పతకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జావెలిన్ త్రోలో రజతం గెలిచిన నీరజ్ చోప్రా, కాంస్య పతక విజేత యశ్వీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


'గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా అద్భుతం చేసి.. రజత పతకం అందుకున్నాడు. మెడల్ సాధించే క్రమంలో నిలకడ, సంయమనం, స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇదే ఆత్మవిశ్వాసంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. యశ్వీర్‌కు శుభాకాంక్షలు. అద్భుతంగా త్రో చేసి.. పతకం సాధించావు. ఆటపై నీకున్న ఆసక్తి, నిబద్ధతకు ఇదే నిదర్శనం. ఈ విజయంతో యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచావు' అని మోదీ పోస్ట్ చేశారు.


అలానే ఇతర విభాగాల్లో మెడల్స్ సాధించిన యామిని మౌర్య, తేజశ్విన్ శంకర్‌కు ప్రధాని మోదీ విషెష్ తెలిపారు. 'జూడో 57 కేజీల విభాగంలో రజతం నెగ్గిన యామిని మౌర్య, డెకథ్లాన్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన శంకర్‌కు శుభాకాంక్షలు. జూడో పట్ల యామిని అభిరుచి అభినందనీయం. ఎక్కువ మంది యువత జూడో వైపు వచ్చేందుకు మౌర్య విజయం బాటలు వేస్తుంది. ఇక పది ఈవెంట్లలో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన తేజశ్విన్ కష్టానికి ప్రతిఫలం దక్కింది. భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ప్రధాని మోదీ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయి.. నీరజ్ చోప్రా భావోద్వేగం

కామన్వెల్త్ గేమ్స్: ఓడిపోయినా కాంస్యం.. దేశానికి తొలి పతకం అందించిన బాక్సర్ తరోనా

Updated Date - Aug 01 , 2026 | 03:23 PM