Share News

ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య..

ABN , Publish Date - Aug 01 , 2026 | 02:53 PM

హర్యానాకు చెందిన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ శీలు బల్హారా భార్య ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రోహ్‌తక్ జిల్లా మెహమ్ ప్రాంతంలోని నివాసంలో 23 ఏళ్ల ముస్కాన్ విగతజీవిగా కనిపించింది.

ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య..
Wife Of International Kabaddi Player

ఇంటర్‌నెట్ డెస్క్: హర్యానాకు చెందిన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ శీలు బల్హారా భార్య ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం సాయంత్రం రోహ్‌తక్ జిల్లా మెహమ్ ప్రాంతంలోని నివాసంలో 23 ఏళ్ల ముస్కాన్ విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ముస్కాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. 2023 డిసెంబర్ నెలలో ముస్కాన్, శీలుల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు గత ఏడాది నవంబర్‌ నెలలో ఓ కుమారుడు జన్మించాడు. ముస్కాన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు ముస్కాన్ ఓ పంజాబీ పాటకు సంబంధించిన రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముస్కాన్ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

స్పెయిన్ చేరినా ఆకలే.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనక్కి..

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్ విడుదల

Updated Date - Aug 01 , 2026 | 02:56 PM