Share News

స్పెయిన్ చేరినా ఆకలే.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనక్కి..

ABN , Publish Date - Aug 01 , 2026 | 02:07 PM

మొరాకో నుంచి సముద్రం దాటి స్పెయిన్‌కు చెందిన స్యూటాలోకి ప్రవేశించిన దాదాపు 60 వేల మంది వలసదారుల్లో సుమారు 45 వేల మంది కేవలం ఒక్క రోజులోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు

స్పెయిన్ చేరినా ఆకలే.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనక్కి..
Ceuta migration crisis

ఐరోపాలో కొత్త వలస సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొరాకో నుంచి సముద్రం దాటి స్పెయిన్‌కు చెందిన స్యూటాలోకి ప్రవేశించిన దాదాపు 60 వేల మంది వలసదారుల్లో సుమారు 45 వేల మంది కేవలం ఒక్క రోజులోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు (Ceuta migration crisis).


వలసదారులు చెప్పిన వివరాల ప్రకారం, స్యూటాకు చేరుకున్న తర్వాత వారికి తినడానికి సరిపడా ఆహారం, ఉండేందుకు ఆశ్రయం, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లభించలేదు. చాలామంది రోడ్లపైనే రాత్రి గడపాల్సి వచ్చింది. కొందరు తమను భద్రతా సిబ్బంది కొట్టారని కూడా ఆరోపించారు. ఐరోపాలో మెరుగైన జీవితం దొరుకుతుందన్న ఆశ నిజం కాదని తేలడంతో చాలా మంది తిరిగి మొరాకోకు వెళ్లిపోయారు (Morocco migrants).


స్పెయిన్‌కు చెందిన చాలా చిన్న భూభాగమైన స్యూటాకు కొద్ది గంటల్లోనే వేలాది మంది చేరడంతో అక్కడి శిబిరాలు పూర్తిగా నిండిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ అదనపు పోలీసులు, సైనికులను మోహరించింది. ఇదే సమయంలో మొరాకో కూడా సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది (Moroccan migrants return).

spain2.jpg


ఈ భారీ వలస ప్రయత్నం తీవ్ర విషాదానికి దారితీసింది (Spain Morocco border). స్పానిష్ అధికారుల ప్రకారం, స్యూటాకు చేరుకునే ప్రయత్నంలో కనీసం 57 మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో మునిగిపోవడం, రద్దీలో తొక్కిసలాటకు గురికావడం వంటి కారణాలతో ఈ మరణాలు సంభవించాయి. కాగా, ఈ వలసపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వలసలను ప్రోత్సహిస్తున్న మానవ అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 01 , 2026 | 02:10 PM