Share News

రీల్స్‌లోనే క్షమిస్తారా.. కేసులూ ఎత్తేస్తారా.. ప్రధాని మోదీకి సీజేపీ అధినేత అభిజీత్ ప్రశ్న..

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:20 PM

విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రీల్స్‌లోనే క్షమిస్తారా.. కేసులూ ఎత్తేస్తారా.. ప్రధాని మోదీకి సీజేపీ అధినేత అభిజీత్ ప్రశ్న..
Abhijeet Dipke about PM Modi Instagram video

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'రీల్‌లో మాత్రమే క్షమిస్తారా? లేక విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటారా?' అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు (Abhijeet Dipke CJP).


ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో, కొందరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని స్పందిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. తనను, తన తల్లిని దూషించిన వారిని తాను క్షమిస్తున్నానని, వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు (PM Modi Instagram video).


ఈ వీడియోపై స్పందించిన అభిజీత్ దిప్కే, 'క్షమించామని చెప్పడం సరిపోదు. విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తారా?" అని ప్రశ్నించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక కెమెరామెన్‌పై అనుచిత పదజాలం ఉపయోగించిన వీడియోను ప్రస్తావిస్తూ, 'ఈ దేశంలో రెండు రకాల చట్టాలా? యువతకు ఒకటి, అధికార పార్టీకి మరొకటా?' అని విమర్శించారు (student protest cases).


కాగా, ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో నోయిడాకు చెందిన ఓ బాలికపై కేసు నమోదైంది (Jantar Mantar protest). తాజాగా ఆమె వీడియో విడుదల చేసి దేశ ప్రజలకు, ప్రధానమంత్రికి క్షమాపణలు చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కాగా, నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి..

చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 01 , 2026 | 12:20 PM