Share News

కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో రెండు పసిడి పతకాలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 04:33 PM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. ఇవాళ బాక్సింగ్ విభాగంలో భారత్ ఈ రెండు పసిడి పతకాలను సాధించింది. మహిళల 54 కేజీలు, 57 కేజీల విభాగాల్లో భారత్ అథ్లెట్స్ గోల్డ్ మెడల్స్ గెలిచారు.

కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో రెండు పసిడి పతకాలు
India boxing gold medals

స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. ఇవాళ బాక్సింగ్ విభాగంలో భారత్ ఈ రెండు పసిడి పతకాలను సాధించింది. తొలుత మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ గెలిచింది. తుదిపోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోను ప్రీతి చిత్తుగా ఓడించింది. అనంతరం మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా భారత్ కు పసిడిని అందించింది. ఫైనల్ లో నార్తర్మ్ ఐర్లాండ్ కు చెందిన మైఖేలా వాల్ష్ పై జైస్మిన్ విజయం సాధించింది.


భార‌త మ‌హిళా బాక్సర్ ప్రీతి ప‌వార్ మ‌హిళ‌ల 54 కేజీల విభాగంలో స్కార్లెట్ స‌వ‌న్నాపై సునాయాసంగా గెలుపొందింది. తొలి బౌట్ నుంచి ప్రీతి ప్రత్యర్థిపై పంచ్‌ల‌తో విరుచుకుప‌డింది. ఇక రెండో బౌట్‌లోనూ ప్రీతి స్కార్లెట్ ముఖంపై పంచుల వ‌ర్షం కురిపించి ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో బౌట్‌లోనూ తనదైన శైలిలో విరుచుకుపడ్డ ప్రీతి పవార్‌ను యునానిమస్‌ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.


ఇప్పటికే బాక్సింగ్‌ విభాగం నుంచి కనీసం 10 పతకాలు ఖాయమైన సంగతి తెలిసిందే. ఇక మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా స్వర్ణం కైవ‌సం చేసుకుంది. కామ‌న్‌వెల్త్‌లో భార‌త్‌కు ఇది ఏడో స్వ‌ర్ణం కాగా, ఓవ‌రాల్‌గా 25వ ప‌త‌కం.


ఇక పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రావేల్ 16.58 మీటర్ల ఎత్తు ఎగిరి రజతం సాధించాడు. మరో అథ్లెట్ సెల్వ ప్రభు 16.52 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం అందుకున్నాడు. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరుకుంది. ఇందులో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్ 2026 విజేతలను ప్రశంసించిన ప్రధాని మోదీ

భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ అవుతాడేమో: ఈస్ట్ జోన్ సెలెక్టర్

Updated Date - Aug 01 , 2026 | 05:11 PM