Share News

13 వేల మంది‌తో థింసా నృత్యం నన్ను కదిలించింది: ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 01 , 2026 | 04:30 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ 13 వేల మంది గిరిజన విద్యార్థినిలు, మహిళలు థింసా నృత్యం చేశారు. థింసా నృత్యంపై ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

13 వేల మంది‌తో థింసా నృత్యం నన్ను కదిలించింది: ప్రధాని మోదీ
Thinsa Dance

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ 13 వేల మంది గిరిజన విద్యార్థినిలు, మహిళలు థింసా నృత్యం చేశారు. థింసా నృత్యంపై ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘13 వేల మంది చేసిన థింసా నృత్యం నన్ను కదిలించింది. ఈ అపూర్వ స్వాగతం ఏపీ ప్రజల ఆత్మీయతకు ప్రతీక. సాంస్కృతిక వారసత్వాన్ని థింసా ప్రతిబింబించింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని.. థింసా నృత్యం చిరస్మరణీయంగా మార్చింది’ అని రాసుకొచ్చారు.


ప్రధాని మోదీ మరో పోస్టులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం గురించి స్పందిస్తూ.. ‘నా మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. సెమికండక్టర్లు, ఐటీ, ఇన్నోవేషన్స్ వంటి రంగాలలో రాష్ట్రం అద్భుతమైన కృషి చేస్తోంది. ఇది రాష్ట్రంలోని యువతకు ప్రత్యేక ప్రయోజనాలను చేకూరుస్తుంది’ అని రాసుకొచ్చారు.


ఏపీ అభివృద్ధిపై స్పందిస్తూ.. ‘కేంద్రంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో వేగంగా పని చేస్తోంది. మేము బ్లూ ఎకానమీ, నౌకాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, ఇతర రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము’ అని పేర్కొన్నారు.


ఎయిర్‌పోర్టు పేరుపై స్పందిస్తూ.. ‘భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా.. నా ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక అభినందనలు. మహానుభావుల స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించి, వారిని గౌరవించాలనే మా సంకల్పానికి అనుగుణంగా ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

శభాష్! బాగా పనిచేస్తున్నావ్.. మంత్రి లోకేశ్‌పై ప్రధాని ప్రశంసలు

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ నెట్‌వర్క్‌లోని కీలక పాత్రధారి అరెస్ట్

Updated Date - Aug 01 , 2026 | 04:35 PM