Share News

శభాష్! బాగా పనిచేస్తున్నావ్.. మంత్రి లోకేశ్‌పై ప్రధాని ప్రశంసలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 04:18 PM

భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం అక్కడి నుంచి బయల్దేరారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను ‘నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శభాష్ లోకేశ్’ అంటూ ప్రశంసించారు.

శభాష్! బాగా పనిచేస్తున్నావ్.. మంత్రి లోకేశ్‌పై ప్రధాని ప్రశంసలు
Bhogapuram Airport

విజయనగరం, ఆగస్టు 1: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధానికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన లోకేశ్ భుజం తట్టి.. ‘నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శభాష్ లోకేశ్’ అని ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంపై కూడా ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.


నారా లోకేశ్ పనితీరును ప్రధాని మోదీ మెచ్చుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని పాల్గొన్న పలు ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించిన సందర్భాల్లోనూ మోదీ ఇదే తరహాలో ఆయనను అభినందించారు. ముఖ్యంగా 'యోగాంధ్ర' కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డు స్థాయిలో యోగా నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. తాజాగా భోగాపురం పర్యటన సందర్భంగా మరోసారి లోకేశ్‌ను ఆప్యాయంగా అభినందించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రధాని సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

Updated Date - Aug 01 , 2026 | 04:24 PM