ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ నెట్‌వర్క్‌లోని కీలక పాత్రధారి అరెస్ట్
ABN , Publish Date - Aug 01 , 2026 | 04:09 PM
పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టయిన జైషే మహమ్మద్ (JeM) అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో ఎస్టీఎఫ్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌కు తరలించారు.
అనుమానిత ఉగ్రవాది హమీమ్ మోండల్‌ను గురువారం బర్ధమాన్ పట్టణంలోని ఒక పెద్ద ఇంట్లో ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ (ISI) మద్దతుతో పనిచేస్తున్న ఒక పెద్ద ఉగ్ర నెట్‌వర్క్‌లో హమీమ్ కీలక పాత్ర పోషిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నాయకులతో పాటు పలువురు ముఖ్యమైన వీఐపీల సమాచారాన్ని సేకరించడం వారి టార్గెట్. దీని కోసం కొత్త వారిని రిక్రూట్మెంట్లో చేర్చుకోవడం, రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళికలు రచించేందుకు సిద్ధమయ్యారు.
దర్యాప్తులో భాగంగా హమీమ్, అర్పితల మధ్య క్రమం తరచూ జరిగిన వాట్సాప్ సంభాషణల (WhatsApp Chats) వివరాలను అధికారులు సేకరించారు. పశ్చిమ బెంగాల్‌లోని కీలకమైన రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి హమీమ్ ఈమెను ఒక సాధనంగా వాడుకున్నట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. అరెస్టు అనంతరం ఇద్దరినీ విచారిస్తున్న పోలీసులు, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి:
ట్విన్స్‌ను పెళ్లి చేసుకున్న ట్విన్స్.. పెళ్లి జరిపించిన పాస్టర్లు కూడా ట్విన్స్..
ఇథనాల్ బ్లెండింగ్ లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది: కేంద్రం