Share News

భోగాపురం విమానాశ్రయంపై ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - Aug 01 , 2026 | 04:00 PM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. విమానాశ్రయం టెర్మినల్ వద్ద నిలబడి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైపు చూపిస్తున్న స్టిల్ ఫొటోను షేర్ చేస్తూ ‘The future? Yeah... it's that way!’ అని క్యాప్షన్ ఇచ్చారు.

భోగాపురం విమానాశ్రయంపై ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఎక్స్‌’ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. విమానాశ్రయం టెర్మినల్ వద్ద నిలబడి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైపు చూపిస్తున్న స్టిల్ ఫొటోను షేర్ చేస్తూ ‘The future? Yeah... it's that way!’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త గేట్‌వేగా మారబోతోందనే సంకేతాన్ని పోస్టు ద్వారా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా #NewGatewayToAP హ్యాష్‌ట్యాగ్‌తో ఏపీ అభివృద్ధిపై పోస్ట్ చేశారు.


అలాగే #BhogapuramAirport హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని అంతర్జాతీయ విమానాశ్రయం ఆకర్షిస్తుందని వ్యాఖ్యానించారు. #GatewayToUttarandhra హ్యాష్‌ట్యాగ్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధిపైనా ఎక్స్‌లో సీఎం పోస్ట్ చేశారు. విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేసిన నేపథ్యంలో #ModiHonoursAlluri హ్యాష్‌ట్యాగ్‌తో అల్లూరి సీతారామరాజుకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి...

దేశాన్ని వికసిత్‌ భారత్‌ దిశగా నడిపిస్తోన్న నేత మోదీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆదివాసీ బాలికల థింసా నృత్యం అద్భుతం: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 04:15 PM