ఆదివాసీ బాలికల థింసా నృత్యం అద్భుతం: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 01 , 2026 | 03:46 PM
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆదివాసీ బాలికల థింసా నృత్యం అద్భుతమని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. 13 వేల మందికిపైగా ఆదివాసీ బాలికలతో ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రదర్శన ఇచ్చారన్నారు.
అమరావతి, ఆగస్టు 1: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి 13,500 మంది గిరిజన విద్యార్థినిలు, మహిళలు థింసా నృత్యంతో స్వాగతం పలకడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆదివాసీ బాలికల థింసా నృత్యం అద్భుతమని కొనియాడారు. 13 వేల మందికిపైగా ఆదివాసీ బాలికలతో ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రదర్శన ఇచ్చారన్నారు. థింసా నృత్యం.. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివాసీ బాలికలు ఘన స్వాగతం పలికారని సీఎం ప్రశంసించారు. ‘వికాస్ భీ.. విరాసత్ భీ’ స్ఫూర్తిని థింసా ప్రదర్శన ప్రతిబింబించిందన్నారు. అభివృద్ధితో పాటు వారసత్వాన్ని కూడా ఏపీ చాటిచెప్పిందని తెలిపారు. ఆదివాసీల ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. థింసా ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిందని ప్రశంసిస్తూ.. ఆదివాసీ బాలికలు, తల్లిదండ్రులు, శిక్షకులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ సింహద్వారం: కేంద్ర మంత్రి రామ్మోహన్
దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తోన్న నేత మోదీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News