దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తోన్న నేత మోదీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:24 PM
140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భారత్‌ను ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తోన్న నేత ప్రధాని మోదీ అని కొనియాడారు.
విజయనగరం, ఆగస్టు 1: 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు(శనివారం) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. భారత్‌ను ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తోన్న నేత ప్రధాని అని తెలిపారు. దేశాన్ని మోదీ వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న నేత మోదీ అని కొనియాడారు. తనను దూషించినవారిని కూడా క్షమించే గుణం ప్రధానిది అని చెప్పుకొచ్చారు.
తెలుగుజాతి ఎవరికీ తలవంచదని అల్లూరి గర్జించారని డిప్యూటీ సీఎం అన్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో అగ్రగామిగా ఏపీ మారుతోందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ సరికొత్త అధ్యాయమని వెల్లడించారు. దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే కీలకమని ప్రధాని మోదీకి తెలుసన్నారు. రైల్వే జోన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ సింహద్వారం: కేంద్ర మంత్రి రామ్మోహన్
Read Latest AP News And Telugu News