Share News

థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:46 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ గిరిజన విద్యార్థినిలు, మహిళలు చేసిన థింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
Bhogapuram International Airport

విజయనగరం, ఆగస్టు 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ గిరిజన విద్యార్థులు, మహిళలు చేసిన థింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 13500 మంది ఒకేచోట చేరి.. సంప్రదాయబద్ధంగా గులాబీ రంగు, ఆకుపచ్చ అంచు చీరలను ధరించి, ఎంతో లయబద్ధంగా థింసా నృత్యం చేశారు. విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్‌టాప్ జీపులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి బహిరంగ సభకు ప్రధాని మోదీ బయలుదేరారు. టెర్మినల్ నుంచి సభా వేదికకు వెళ్లే మార్గంలో వేలాది మంది గిరిజన విద్యార్థినిలు, మహిళలు థింసా నృత్యాన్ని ప్రదర్శిస్తూ మోదీకి ఘన స్వాగతం పలికారు. గిరిజన విద్యార్థినిల థింసా సృత్యాన్ని ప్రధాని ఆసక్తిగా తిలకించారు.


ఈరోజు(శనివారం) ఉదయం భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని మోదీ ప్రారంభించారు. ఆపై టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు.


ఇవి కూడా చదవండి...

44,89,512 ఓట్లు అవుట్!

రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 11:55 AM