స్వాతంత్ర్యం అంటే అది కాదు! జెన్ జీ నిరసనల నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వ్యాఖ్య
ABN , Publish Date - Aug 01 , 2026 | 06:23 PM
నీట్ పేపర్ లీక్‌పై జెన్ జీ నిరసనల నేపథ్యంలో జాతీయ భధ్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించగిలిగే అపరిమిత స్వేచ్ఛ కాదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్‌పై జెన్ జీ నిరసనల నేపథ్యంలో జాతీయ భధ్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించగిలిగే అపరిమిత స్వేచ్ఛ కాదని అన్నారు. పూణెలో హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు స్వీకరించిన అనంతరం డోభాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర పోరాటం నాటి త్యాగాలు, విలువలకు యువత ప్రతిబింబంగా నిలవాలని అన్నారు. వ్యక్తులకు స్వేచ్ఛతో పాటు సమాజం, దేశం విషయంలో బాధ్యతలు కూడా ఉంటాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.
‘భారత్ గతంలో కూడా ఇలాగే ఉండేదని కొందరు యువత అనుకుంటూ ఉండవచ్చు. లేదా స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించగలిగే అపరిమిత స్వేచ్ఛ అని పొరపాటుపడుతూ ఉండొచ్చు. కానీ స్వాతంత్రం అంటే అది కాదు’ అని అన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛతో పాటు దేశం పట్ల బాధ్యత కూడా కలిగి ఉండాలని సూచించారు. స్వాతంత్ర సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. ‘ఆయన చెప్పిన విషయాల గురించి యువత లోతుగా ఆలోచించాలి. భారత భవిష్యత్తు, జాతి నిర్మాణం గురించి ఆయనకున్న ఆలోచనల గురించి తెలుసుకోవాలి’ అని అన్నారు.
డోభాల్‌పై హోం మంత్రి ప్రశంసలు..
అవార్డు ప్రదానం సందర్భంగా హోం మంత్రి అమిత్ షా అజిత్ డోభాల్‌పై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానం, జాతీయ భద్రతా విధానాలను ఆయన బలోపేతం చేశారని అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించి ప్రధాని తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక డోభాల్ పాత్ర, సూచనలు ఉంటాయని అన్నారు. చరిత్రలో డోభాల్‌కంటూ ఒక బంగారు పేజీ ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇథనాల్ బ్లెండింగ్ లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది: కేంద్రం
ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ నెట్‌వర్క్‌లోని కీలక పాత్రధారి అరెస్ట్