రేపే హై వోల్టేజ్ మ్యాచ్.. భారత్‌తో తలపడనున్న పాక్
ABN , Publish Date - Aug 01 , 2026 | 09:39 PM
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మ్యాచ్ ఏదైనా ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య ఓ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మ్యాచ్ ఏదైనా ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ దాయాది దేశాల మ్యాచ్ అంటే ఆఖరి దాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతాయి. భారత్, పాక్ మ్యాచులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఏ మ్యాచ్ అయినా భారత్, పాక్ మ్యాచ్ అంటే.. క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మరి... ఆ మ్యాచ్ ఏంటి?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు2 (ఆదివారం) భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్ వేదికగా ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇండియన్ రాయల్స్ జట్టును మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ నడిపించనుండగా.. దినేష్ కార్తీక్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు, రిషి ధావన్, స్టువర్ట్ బిన్ని వంటి స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో శిఖర్ సేన బంగ్లాదేశ్ టైగర్స్ జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి మంచి ఫామ్‌లో ఉంది.
ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. ఈ జట్టుకు మహమ్మద్ హఫీజ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, వహాబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ వంటి వెటరన్ ఆటగాళ్ల ఉన్నారు. పాకిస్థాన్ పాంథర్స్ జట్టు తొలి మ్యాచ్‌లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. దీంతో మ్యాచ్‌తో భారత జట్టు ఫెవరెట్‌గా కనిపిస్తోంది.
ఏషియన్ లెజెండ్స్ లీగ్:
ఆసియా ఖండానికి చెందిన రిటైర్డ్ దిగ్గజ క్రికెటర్లతో ఏషియన్ లెజెండ్స్ లీగ్‌ను గతేడాది ప్రారంభించారు. ఈ ఏడాది సీజన్-2 జులై 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 10న ముగియనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 19 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది జరిగిన తొలి సీజన్‌లో భారత్ ఫైనల్ చేరుకుని రన్నరప్ నిలిచింది. ఆ మ్యాచ్‌లో ఏషియన్ స్టార్ జట్టు విజేతగా నిలిచింది. మొత్తంగా క్రేజీ మ్యాచుల కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు భారత్, పాక్ పోరు ఫుల్ మీల్స్ అందించనుంది.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్‌లో భారత్‌కు రెండు పతకాలు
నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..