ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:51 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తనపై ప్రశంసలు కురిపించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని 'ఎక్స్' పోస్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు రిప్లై ఇచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తనపై ప్రశంసలు కురిపించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని 'ఎక్స్' పోస్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు రిప్లై ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని మోదీకి ఆప్యాయత, ప్రత్యేక శ్రద్ధ ఉన్నాయని అన్నారు. ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 2024లో కూటమి అధికారం చేపట్టేనాటికి తీవ్ర ఆర్థిక సంక్షోభం సహా విధ్వంసమైన వ్యవస్థలతో ఏపీ వెంటిలేటర్‌పై ఉందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ అండదండలతో ఏపీని మళ్లీ గాడిలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ ఇచ్చే ప్రోత్సాహం, చొరవే ఆంధ్రప్రదేశ్ పునర్‌నిర్మాణానికి బలమైన పునాది అని అన్నారు. పోలవరం, రాజధాని అమరావతి వంటి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు సాయం చేశారన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
'బజ్‌బాల్' మార్గం మారదు.. ప్రయోగాలు తగ్గవు: ఇంగ్లండ్ నూతన సారథి రూట్
చాక్లెట్ తినే అలవాటు ఉందా? రోజుకు ఎంత తినాలో తెలుసా?