Share News

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:00 AM

భోగాపురం విమానాశ్రయంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు భోగాపురం ఎయర్‌పోర్టే కొత్త గేట్‌వే అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు విమానాశ్రయం టెర్మినల్‌ వద్ద దిగిన ఫొటోను ట్యాగ్‌ చేశారు.

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!
Chandrababu Naidu

అమరావతి(ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు భోగాపురం ఎయర్‌పోర్టే కొత్త గేట్‌వే అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు విమానాశ్రయం టెర్మినల్‌ వద్ద దిగిన ఫొటోను ట్యాగ్‌ చేశారు. థింసా నృత్యంపైనా మరో పోస్టు చేశారు. ‘భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ఆకట్టుకుంది. 13వేల మందికిపైగా ఆదివాసీ బాలికలతో ప్రపంచ రికార్డు స్థాయి ప్రదర్శన నిర్వహించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటారు. వికాస్‌ భీ విరాసత్‌ భీ స్ఫూర్తిని ఈ ప్రదర్శన ప్రతిబింబించింది. ఆదివాసీల ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం. థింసా ప్రదర్శనతో ఏపీకి అంతర్జాయతీయ గుర్తింపు తెచ్చారు. ఈ నృత్యంలో భాగస్వాములైన వారికి అభినందనలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


మరో సందేశంలో... ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో విమానాలే కాదు... కొత్త అవకాశాలు, పెట్టుబడులు కూడా వస్తాయి. ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. ఆర్థిక ప్రగతికి సరికొత్త రెక్కలు తొడిగే భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర ఇక ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర అవుతుంది. ప్రధాని పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు’ అని సీఎం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

Updated Date - Aug 02 , 2026 | 09:00 AM