45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:05 AM
బిర్యానీ తినే పోటీల్లో పాల్గొన్న ఓ వ్యక్తి 45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిని రికార్డు సృష్టించాడు. పోటీలో గెలిచి జీవిత కాలం ఫ్రీగా బిర్యానీ తినే అవకాశాన్ని సంపాదించాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: బిర్యానీ తినే పోటీల్లో పాల్గొన్న ఓ వ్యక్తి 45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిని రికార్డు సృష్టించాడు. పోటీలో గెలిచి జీవిత కాలం ఫ్రీగా బిర్యానీ తినే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన ప్రముఖ షిరాజ్ గోల్డెన్ రెస్టారెంట్ 85వ యానివర్సరీ సెలెబ్రేషన్స్‌లో భాగంగా బిర్యానీ తినే పోటీ పెట్టింది. వంద మందికిపైగా ఈ పోటీలో పాల్గొన్నారు.
25 మంది ఫైనలిస్టులు తాజాగా, ‘ది బిర్యానీ మ్యాన్’ టైటిల్ కోసం పోటీ పడ్డారు. ప్రమిత్ కుమార్ దాస్ అనే వ్యక్తి 45 నిమిషాల్లో 5 ప్లేట్ల మటన్ బిర్యానీ తిన్నాడు. ‘ది బిర్యానీ మ్యాన్’ టైటిల్ గెలిచాడు. టైటిల్ గెలిచిన ప్రమిత్‌కు రెస్టారెంట్ ‘లైఫ్ టైమ్ బిర్యానీ ఫ్రీ’ కార్డును అందించింది. మిగిలిన 24 మంది ఫైనలిస్టులకు ‘త్రీ ఇయర్ షిరాజ్ లాయల్టీ కార్డ్స్’ అందించింది. ఈ కార్డ్‌తో షిరాజ్ రెస్టారెంట్ అవుట్‌లెట్లలో డిస్కౌంట్ ధరలకు ఆహారాన్ని పొందొచ్చు.
ఇవి కూడా చదవండి