Share News

సాయికృష్ణ తల్లిని బెదిరించారా?

ABN , Publish Date - Aug 02 , 2026 | 08:53 AM

‘నీ కొడుకు చనిపోయాడు. ఇంటికి వెళ్లి వాడి ఫొటోకు దండ వేసుకో..’ అన్న మాటలు ఎందుకు అన్నారని విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌ సస్పెండెడ్‌ సీఐ నాగరాజును సిట్‌ అధికారులు ప్రశ్నించారు.

సాయికృష్ణ తల్లిని బెదిరించారా?
Gade Saikrishna Case

విజయవాడ (ఆంధ్రజ్యోతి): ‘‘నీ కొడుకు చనిపోయాడు. ఇంటికి వెళ్లి వాడి ఫొటోకు దండ వేసుకో.’’ అన్న మాటలు ఎందుకు అన్నారని విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌ సస్పెండెడ్‌ సీఐ నాగరాజును సిట్‌ అధికారులు ప్రశ్నించారు. శనివారం మూడో రోజు ఉదయం 10 నుంచి రాత్రి 7గంటల వరకు ఆయనను విచారించారు. రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు సంధించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చినప్పుడు ఆమెను ఎందుకు బెదిరించారని ప్రశ్నించారు. సాయికృష్ణ శరీరంపై ఉన్న గాయాలకు ఆర్‌ఎంపీ వైద్యుడితో ఎక్కడ వైద్యం చేయించారని అడిగారు. సిట్‌ అధికారులు అడిగిన ప్రశ్నల్లో చాలా కొద్దివాటికి మాత్రమే నాగరాజు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

Updated Date - Aug 02 , 2026 | 08:53 AM